పాడుతా నేపాడుతా:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
పాడుతా నే పాడుతా
తీయనీ తెలుగు పాట
నే పాడుతా వినాలని మిమ్ములను వేడుతా  !

పాడెదనూ నేపాడెదనూ
మా తెలుగు పాటనే ఇక పాడెదను
 మీరంతా నేడే వింటారని నేను వేడదనూ  

పాడెదనూ నే పాడెదనూ
మంచి పాటనే పాడెదనూ
మీకునచ్చేలా మరిమెచ్చేలా
నాకు ఇక పేరును తెచ్చేలా. !

పాడెదనూ నే పాడెదను
ప ద ని స స రి గ మ అను
పాటను వెంటనే పాడెదను
వినుటకు మిమ్మే వేడెదను !

పాడెదనూ  నే పాడెదను
సప్తస్వర గీతం పాడెదను
ఆపద్బాంధవులై మీ రొచ్చి
ఇస్తారు కానుక నను మెచ్చి !

పాడుతా నేనిక  పాడుతా 
మధుర గీతమునే పాడుతా
అధరహో అని నే అనిపిస్తా
అందరికి ఇక నేను నేర్పిస్తా !

పాడుతా నేను పాడుతా
మంగళ గీతం నేపాడుతా
గుడి తలుపులనే తడుతా
దేవుని ఎదుట నిలబడతా !

పాడెదను నేనిక  పాడెదను
విజయ గీతమునే పాడెదను 
అపజయమును నేవీడెదను
విజయుడనై ఇక వచ్చెదను!

పాడెదను నేనిక పాడెదను
ప్రార్థన గీతమునే పాడెదను
స్వార్థమునే ఇక నే వీడెదను
నిస్వార్థ సేవకై నే వేడదను. !


కామెంట్‌లు