చిలిపి చూపుల చిన్నది
వలపు రేపుతు ఉన్నది
కొంటె చూపులతో తాను
వెంటపడుతూ ఉన్నది
ఆగు ఆగు మంటుంది
నన్ను గిల్లుకుంటుంది
కనుసైగా చేసుకుంటూ
కన్ను గీటు ఉంటుంది !
ముద్దు ముద్దు నీ వంటూ
సుద్దులను చెప్పుకుంటూ
నా చుట్టూ తిరుగుకుంటూ
ఉంటది నన్ను తిట్టుకుంటూ!
నాకిప్పుడు తాళికట్టు బావ
నేనెప్పుడూ చేస్త నీకు సేవ
అంటూ వెంట పడుతుంది
గుండె తలుపు తడుతుంది !
తనకు తాళి నేను కట్టలేక
తనను నేను ఏమి తిట్టలేక
నేను ఇక మదన పడుతున్న
మనో వేదనతోని చెడుతున్న
నా వేదనను తాను గమనించి
నా కడకు తాను ఇక ఏతెంచి
బావ బావ ఈ మౌనంఎందుకు ?
రావా రావా నీ మరదలు విందుకు !
నా మరదలు మాటలు కోటలు దాటే
ఆ మాటలు నా మనసు వీణను మీటే
ప్రేమే దైవమని నా మరదలు ఇక చాటే
ఇక మేము ఏకమై పట్టాము ప్రేమ రూటే !
ముద్దు ముద్దు నీవంటూ
సుద్ధులను చెప్పుకుంటూ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి