ఏమి పాపమును చేసితినో
ఏమి దోషమును మోసితినో
గత జన్మల యందున నేను
అందుకే ఉన్నా ఈస్థితిలోను !
గత జన్మల నేచేసిన అకృత్యాలు
ఈ జన్మలో నాకు ఆయే శాపాలు
సంభవించే జీవిత మందు కష్టాలు
నెరవేరకపోయెను ఇక నా ఇష్టాలు
గత జన్మలో చేసిన ఎన్నోపాపాలు
పెట్టించే ఈ జన్మలో నాతో శోకాలు
ఆయెగ జీవితమంతా కష్టాలపాలు
నా బతుకిక కుళ్ళి కృషించి కూలు
నా పూర్వజన్మ అఘాయిత్యాలు
నాకీజన్మలో కలిగించేను నష్టాలు
జీవితాన సంభవించేను ఇక్కట్లు
బ్రతుకులోన మిగిలెను అగచాట్లు !
గత జన్మలో నేచేసిన దుష్కార్యం
చెడు కలిగించి ఆయే అనివార్యం
ఈ జన్మకు కలుగదు నాకిక సద్గతి
నాబ్రతుకుకు కలిగెనులే ఇకదుర్గతి
గత జన్మలో అన్యులపై కూసిన కూతలు
ఈ జన్మలో నా కాయంపై పెట్టెను వాతలు
మందు పూసిన అవి మాయని వాతలు
నా బ్రతుకు వస్త్రంపై అవి చెరగని గీతాలు !
గత జన్మలో నే చేసిన కర్మల దోషం
నాబతుకును చుట్టిన యమపాశం
నా బతుకు పైన నాకే పుట్టెను రోత
చీ అనిపించెను నను అందరి చేత
గత జన్మలో నేచెప్పిన అబద్ధాలు
ప్రకటించేను నాపై అవి యుద్ధాలు
ప్రస్తుత జీవితానికి అవి విరుద్ధాలు
చూపె అవి బ్రతుకులో వైరుధ్యాలు
గత జన్మలో నేచేసిన నాతప్పులు
ఈజన్మకు తెచ్చిపెట్టనుగా తిప్పలు
వానితో ఆయెనుగా ఇక అప్పులు
అవి పెట్టే నన్ను ముప్పు తిప్పలు
గత జన్మల తలచి వగచుటవ్యర్థం
తేల్చుకో ప్రస్తుతం దీని పరమార్థం
పశ్చాత్తాపం నొంది విడువు స్వార్థం
నీబతుకును నిలదొక్కుకో కార్యార్థం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి