గణతంత్ర దినోత్సవం !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
భారత గణతంత్ర దినం వచ్చింది
భరతమాత పుత్రగణం మెచ్చింది
ఐక్యతయే లోకమై వారు చేస్తారు
సఖ్యతతో ఏకమై జనం ఇక చూస్తారు !

వారు చెప్పుతారు అందరికీ స్వాగతం
విప్పుతారు తొందరగా వారి మనోగతం
విశ్వజనమంతా ఇక కలిసి వస్తారు
ఆవశ్యం వారు కన్న కలల ఫలితాలను చూస్తారు !

ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఇది
ప్రతి ఉత్సవం చేయకుండా ఉండదులే మా మది
ఈ గణతంత్ర ఉత్సవాలకు లేదుగా ఇక పరిధి
స్వతంత్రించి చేయడమే ఇక మనందరి విధి !

రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం
ప్రాథమిక హక్కుల పరిచయ పర్వదినం
ఆరు హక్కులను అందించిన అమరదినం
భరత జనులు మరువలేని స్మరణ దినం !

బ్రిటిష్ ప్రభుత 1935 చట్టం అయ్యింది రద్దు
భారత 1950 రాజ్యాంగ చట్టం కావడం ముద్దు
భారత రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆ పొద్దు
ప్రథమ గణతంత్ర దినోత్సవం ప్రారంభించుట మరువద్దు !

మన గణతంత్ర చారిత్రక అంశాలను గమనిద్దాం
పరతంత్ర ప్రహేళిక పరిణామాలను పరిశీలిద్దాం
నేడు ఈనాడు కలిసి మెలిసి చేయి చేయి కలుపుదాం
హిమశిఖరంపై హిమశిఖరంపై గణతంత్ర దినోత్సవ జెండాను నిలుపుదాం !


కామెంట్‌లు