బుడ్డ పిల్లలం -అడ్డ మల్లెలం:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
]మేం బుడ్డ బుడ్డ పిల్లలం.  
 మా అడ్డ మీది మల్లెలం
  మా అమ్మ లేని వారలం
  మా నాన్న ఉన్న పోలం !

తెల్లవారకముందే లేస్తం
పల్లె తల్లిని ఇక చూస్తం
స్నానం చక్కగా చేస్తం
మా దేవుని  పూజిస్తాం !

మా దేవుడు హనుమ
మీరంతా ఇక వినుమ
మేం రోజంతా పూజిస్తం
మా గుంజీలను తీస్తం !

మేం బడిలో గుడిలో ఉంటం
మా అల్పాహారం ఇక తింటం
మా గురువు మాటలు వింటం
మేంతరువులను పెంచుతుంటం !

అమ్మలేని స్థితిని గ్రహించి
మాకు నాన్న ప్రేమను పంచి 
 మమ్ము పెంచి పెద్ద చేసెను
మా బరువును తామోసెను !


కామెంట్‌లు