మేం క్యాలెండర్ పెద్ద పిల్లలం
మా సిలిండర్ ముద్ద మల్లెలం
కొలువుతనం లేని బాలకులం
నిలువు ధనం ఉన్న బాలికలం !
క్యాలెండర్ కనిపెట్టిన వారలం
సిలిండరు కొనిపెట్టిన పోరలం
కొత్తవి కనిపెట్టుట మా లక్ష్యం
క్యాలెండర్ అందుకు సాక్ష్యం !
ఉద్యోగానికి ఊర్లు ఎన్నో తిరిగాం
అలసి సొలసి అరుగుపై ఒరిగాం
క్యాలెండర్ల బుకింగుకు మరిగాం
ఊరూరుకు మేమంతా ఇక తిరిగాం
మాకు పోటీగా వచ్చారు బాలికలు
వారమ్ముతున్నారు ఎన్నో మాలికలు
ఖర్చు పెట్టారు వారు చెమట ఇంధనాన్ని
నిల్వ చేశారు సంపాదించిన ధనాన్ని !
అప్పుడు తెలిసిందిలే మాకు
కష్టపడితేనే ధనం రేపుమాపు
మన వద్ద ధనం నిలువ ఔతుందని
సమాజంలో విలువ పెరుగుతుందని !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి