ప్రళయ విపత్తు సంభవించి సమస్త జగత్తు నశింపగా; నశించకుండా సదా కొలువై ఉండే ఏకైక దైవం శివుడే నని మహాభారతం వచనం.
యః పురా పురా ప్రళయే ప్రాప్తే నష్టే స్తావర జంగమే ఏకఃతిష్టతివిశ్వాత్మా అను శ్లోకము తెలుస్తుంది.
శివునికి, సృష్టికి గల సంబంధం సముద్రానికి, అలకు గల సంబంధం లాంటిది. అల పుట్టకముందే సముద్రం ఉన్నది.
అల నశించిన తర్వాత కూడా సముద్రం ఉంటుంది. అదేవిధంగా సృష్టి జరగక ముందు శివుడు ఉండను. సృష్టి నశించిన తర్వాత కూడా శివుడు ఉంటాడు. అందుకే యజుర్వేదం
నమో అగ్రియాయ చ ప్రతమాయ చ అని తెలిపినది.
సృష్టికి ముందరివాడు, ప్రథముడైన శివుడికి వందనమని శివుడికి నమస్కరించినది.
ఎన్నో అలలు సముద్రంలో జనించి సముద్రంలోనే స్థితి కలిగి చివరికి సముద్రంలోనే లయించును. అలానే శివుని లోనే సృష్టి జరిగి, శివుని లోనే స్తితి కలిగి చివరికి శివుని లోనే లయించును.
అందుకే పరబ్రహ్మం అంటే ఏమిటో తైత్తరీయోపనిషత్ లో వరుణ దేవుడు తన కుమారుడైన బృగు మహర్షికి
యతోవా ఇమాని భూతాని జాయన్తే
యేన జాతాని జీవన్తి యత్ర్పయస్త్యభిసం విషన్తి
నాయనా ! సమస్త చరాచర ప్రపంచమంతా దేని నుండి జనించి, దీనిలో స్థితి కలిగి, దేనిలో చివరికి లయిస్తుందో, ఆ దైవాన్ని శివుడని చెప్పడం జరిగింది.
ఒక్క శివుడు తప్ప, బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాది దేవతలు సృష్టికి సంబంధించిన వారే. ఒక్క శివుడు మాత్రమే సృష్టికి అతీతమైన వాడు. ఆధారమైన వాడు, అధిష్టానమైనవాడు. నీవెవరు? అని పరమేశ్వరుని ప్రశ్నించిన దేవతలకు పరమేశ్వరుడు అధర్వశిరోపనిషత్తులో ఈ క్రింది విధముగా అన్నాడు.
ఆహా మేకః ప్రథమ మానం వర్తామి చ.
భవిష్యామి చ నాన్యఃకశ్చిన్మత్తోవ్యతిరిక్త ఇతి.
సృష్టికి ముందు నేనొక్కడినే ఉన్నాను. సృష్టికాలంలో జీవులలో అంతర్ర్యామిగాను, సర్వాతీతునిగాను ఉంటాను. సృష్టి అనంతరం నేనొక్కడినే ఉంటాను. నాకు సదా తోడుగా ఉండువాడు ఒక్కడు కూడా లేడని తెలిపెను. అందుకే వశిష్ట మహర్షి శ్రీరామునికి జ్ఞానోపదేశం చేస్తూ శ్రీరామ! నీవు గొప్పగా భావించే బ్రహ్మ విష్ణు రుద్రులు అలల వంటి వారు. నీటి బుడగల వంటి వారు.
కానీ శివుడు సాగరము వంటి వాడని, శివుని యొక్క వైభవాన్ని ఇలా తెలిపారు
బహూని బ్రహ్మ లక్షాణి శంకరేంద్ర శతాని చ
నారాయణ సాహప్రాణి సమ తీతాని రాఘవ.
ఓ రాఘవా! నేటికి అనేక లక్షల మంది బ్రాహ్మలు, వందల కొలది శంకరులు, వేల కొలది నారాయణులు గతించిలని తెలిపెను.
అందుకే వివేకానంద స్వామి నీవు అలను చూడవద్దు, సముద్రాన్ని చూడు అన్నాడు. కాబట్టి అలల వంటి 33 కోట్ల దేవతలను త్యదించి, సాగరం వంటి శివుడిని సేవించి తరించు.
ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి