ఓ మా దేవా !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977-నాగర్ కర్నూల్ జిల్లా
దేవా దేవా ఓ దేవా 
నీవేగా ఇక మా దేవా
మము కరుణించగా
నీవిక వెంటనే రావా !

దేవా దేవా మహదవా
మా స్థితి చూడగా లేవా
మోక్షానికి చూపవ తోవా
మా దైవం నీవే ఇక కావా !

దేవా దేవా మా మహదేవా
మహిమను చూపగా రావా
దుష్టుల తునుమాడగ లేవా
 మమ్ముల కాపాడగా రావా !

దేవా దేవా ఓ నా దేవా
మా కోరిక తీర్చగా రావా
మేం చేస్తున్నం మీకే సేవా
నీవుఇక గమనించగ లేవా !

దేవా దేవా ఓ మా దేవా
 కాపాడే ఆపద్బాంధవా
 మమ్మిక కావగ రాలేవా
నీ దయ చూపించగ లేవా

దేవా దేవా ఓ మహాదేవా
నీవే  ఇక మా దిక్కైనావా
మా పూజలు అందుకోవా
మా నైవేద్యం తినగా రావా !

దేవా దేవా ఓ మా దేవా
నీవేగా మా దీన బాంధవా
కరుణించి నీవు ఇక రావా
దయతో మా దరిచేరగ లేవా

దేవా దేవా ఓ మహదేవా
మా బాధను చూడగ లేవా
 బాపగ  నీవు ఇక రాలేవా
మా మక్తికి చూపవ త్రోవా !


కామెంట్‌లు