సచివాలయం సచివాలయం
మన సచివులకు ఇది నిలయం
ఘన నూతన సచివాలయం
అధునాతన ఆరంతస్తులమయం !
రెండొందల అరవై ఐదు అడుగుల ఎత్తు
తలెత్తిచూస్తే మనమవుతాములే చిత్తు
సీఎం గారు అసలు కాలేదు కించెత్తు
నిర్మించి ఇస్తానని చేశారు వారు పూచికత్తు!
పాత సచివాలయం లోపాలను గమనించి
నూతన ఆలయంలో వాటిని తొలగించి
యుద్ధ ప్రాతిపదికగ భవన నిర్మాణం గావించి
ప్రారంభించేను అన్నింటినీ తాను అధిగమించి !
తెలంగాణ చరిత్ర సాంస్కృతి సాంప్రదాయాల పొదిగి
తెలంగాణ తల్లి సిగలో కిలికుతురాయై ఒదిగి
సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నది
ఏ సౌధం ఇలలో తనకు సాటి లేదంటున్నాది !
ఐకానిక్ భవనంలా రూపుదిద్దుకున్నది
మయసభయై అది మంత్రమేస్తున్నది
అద్భుత సౌధంగా అలరారుతున్నది
జిలుగుల వెలుగులతో మెరిసిపోవుతున్నది!
తిలకించే ప్రేక్షకుల మురిపిస్తున్నది
తాజ్ మహల్ అది మరిపిస్తున్నది
నిలువెత్తు శిఖరంలా తల ఎత్తుక చూస్తున్నది
భాగ్యనగరానికి కొంగుబంగారమై మస్తున్నది!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి