నీవేలే నా ప్రాణం
నీతోనే ప్రయాణం
సాగేలా నే చేస్తా
నీ వైపే నే చూస్తా !
కుర్ర కారు పిల్లవు
జోరు మీద ఉన్నవు
దుమ్మురేపుకుంటూ
దూసుకుపోతున్నవు !
రెండు జడలు వేసుకుని
అగారు నీవు పూసుకుని
నీవు ఎక్కినావు నా కారు
నా చేతికి చిక్కినావు పారు
నీ అందమైన నగు మోము వంక
నేచూడకుండా ఉండలేను ఇంక
తొందర పడుతుందిలే నామనసు
ఈ నాసంగతి నీకు కూడా తెలుసు
ఓ నా పారూ పారూ
నీవు నా పక్కన చేరూ
తెస్తాలే నీకూ నే కారూ
ఇస్తాలే నీకు హుషారు !
అంతదాక నీవు ఇక అలగొద్దు
కాస్త సమయం ఇస్తేనే ముద్దు
షోరూం వెళ్లి చూస్తా ఈ పొద్దు
నే ఇచ్చిన మాటను చేయరద్దు
కారే కావాలని నే నిన్ను కోరలేదు
నీవు మారాలని నీకడ నే చేరలేదు
ఈకారు షికారులు మనకొద్దు బావ
తొక్కొద్దూ మనము ఈ చెడు త్రోవ
నీ చల్లని ప్రేమ ఉంటే చాలు నాకు
నీ ప్రేమే నా తాళికి తగు రక్షణ రేకు
ఈకారు షికారులతో కలుగుచికాకు
చికాకు వల్ల వచ్చు మనకు పరాకు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి