వెన్నెల్లో ఆడపిల్ల !:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387987నాగర్ కర్నూల్ జిల్లా.
వెన్నెల్లోన ఉందిలే ఓ ఆడ పిల్ల
నే చూశాను ఆమెను నిలువెల్లా
ఆమె సౌందర్యానికి నే ప్రణమిల్లా
తన్మయమై ఆమెపై పూలను చల్లా

నా కలల రాణియై తాను వచ్చింది
నా కౌగిలిలో చిక్కి నన్నే మెచ్చింది
ప్రేమ సుధారసాన్నీ నాకందించింది
నఖశిఖముల కసితో నన్నే గిచ్చింది

నా సర్వస్వం నీకే అని నాతో అంది
నేనేలే ఇప్పుడు నీకు చిక్కి దక్కింది
నీచక్కని చుక్కను నేనే అని అంది
నేఒప్పుకుంటే జంటగ ఉంటానంది

ముక్కుకు ముత్యాల ముక్కెర తెమ్మంది
మక్కువతో జత నాతో కళతానంది
పెళ్లికి ముహూర్తం వెంటనే పెట్టమంది
తన మనసులోని మాటను చెప్పింది !

వెలిగే వెన్నెల్లో ఉన్న ఆ ఆడపిల్ల
నా కలలోకి తాను వచ్చెను మల్ల
నే చెప్పిన మాటను ఏం చేస్తావ్
నన్నెందుకు ఒంటరిగా వదిలేశావ్

అంటూ తను నా కాలరును పట్టి
చీ నీవేమి మగాడివంటూ చీకొట్టి
ఆ దెబ్బతో కంగారు నాలో పుట్టే
ఆ వచ్చిన కల కరిగిపోయే ఇట్టే !


కామెంట్‌లు