స్ఫూర్తిదాతలు96:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 కేరళలో కన్నూర్ మెడికల్ కాలేజ్ రోగులకు యువతీయువకులు అక్కడి విద్యార్థులు రోజూ భోజనం తెచ్చి పెడతారు.సూపరింటెండెంట్ సుదీప్ ఆలోచన తో వారు చందాలేసుకుని కొందరు వండితే కొందరు పాత్రలు శుభ్రంచేస్తారు.ఇలా చేసే విద్యార్థులకు మార్కులేస్తారు. వారికి అనుకూలమైన టైంలో క్లాసులు నడుపుతారు.చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ లోని రోగులకు జావ పెరుగన్నం కొబ్బరిపాలు అందిస్తున్న రాజీవ్ అద్దెఇంట్లో ఉంటూ  బీదలకు ఫ్రీగా అందజేస్తున్న ఆయన ఒక చాయ్ దుకాణం నడుపుతున్నాడు.పంజాబ్ లోని కక్కర్ ప్రాంతంలో వృద్ధులంతా హాయిగా సరదాగా గడిపే  ఆలోచన చేశాడు కర్నల్ సింగ్.ఇంట్లోవారు పనుల మీద బైట కెల్తే  ఒంటరి ముసలివారందరూ గురుద్వారా లో చేరుతారు.అంతాకల్సి ప్రార్ధన లు చేయడం చాయ్ వంట చేసుకుని కబుర్లు చెప్తూ చిన్నారిపిల్లల్ని చూస్తారు.ఆపై సాయంత్రం ఎవరిళ్లకు వారు వెల్తారు.వృద్ధుల డేకేర్ లాగా పనిచేస్తోంది కదూ?🌹
కామెంట్‌లు