ఆటవెలది పద్యసుమాలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ -9640748497
 (అంశము :వయసు)
 1)వయసుఉడిగినాకవగచినఫలమేమి
సాధనమ్ముచేయసాధ్యమౌను
కాలధర్మమెరిగి కర్మలు చేయాలి 
వినుము సోదరుండ వీరభద్ర

2)వయసులోన నువ్వు వాడివేడినిచూపు
వయసుపెరుగె ననుచు వగచకెపుడు
వయసుమంత్రగత్తెవయ్యారిదీతమ్మి
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు