మిగుల సంపద పంచు -పుణ్య సంపద పెంచు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
మనంఅనుకున్నట్టు సుఖసంతోషాలతో 
మన జీవనం కొనసాగుతుందా!?
ఎంతో ధనముంది!?
ఇంధ్రభవనంలాంటి ఇల్లుంది.
ఇంటినిండా నౌకర్లు ఉన్నారు.
కాలుక్రిందపెట్టనవసరంలేదు
కూర్చున్న చోటికే అన్నిసమకూరే , 
సమకూర్చే సకలసౌకర్యాలున్నాయి.
అయినా!?

ఏదో వెలితిగా ఉంది

నాది కాని నా శరీరం

నాది కానిది నేను సంపాదించిన ధనం

కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు ఊపిరిరాగినాక చనిపోతే
తండ్రి చచ్చిన మరుక్షణమే
ఆస్తి పంపకాల్లో బిజీబిజీగా ఉన్న పుత్రరత్నాలు

మనకున్నప్పుడు ఇరుగుపొరుగు వారికి
సహాయం చేయని జాలిలేనితనం

ఇతరులను దోపిడీ చేసి , ఆశలు చంపుకొని 
బిడ్డల బాగుకై కడుపుకట్టుకొని నోరు కట్టుకొని పోగేసిన ధనము 
మనం గతించేటప్పుడు 
అది ఇతరులదే అని జ్ఞానోదయం కలిగినా ?!
శ్రమసౌందర్యాన్ని ఆరాధించని పుత్రులు
తేరగా వచ్చేధనంపై వ్యామోహం పెంచుకున్న సంతానం

అప్పటికి మన ఊపిరాగిపోయి
మనమీ భువిపైన లేని సమయం

మనం పోగేసిన
మిగుల ధనాన్ని పంచి పోదాం
పుణ్య సంపద పెంచుకుందాం

నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న సూక్తిని నిజం చేద్దాం


కామెంట్‌లు