1)కన్నుగన్నుచేసికదనమ్మునడిపిరి
కనుల భాష గొప్పతనముగనుము
కనులు సృష్టి చేయుకల్లోలమెంతయో
వినుము సోదరుండ వీరభద్ర
2)కొంటె చూపు చూసి కొంపలుముంచేరు
నంగనాచి చూపు నటన చూపు
నాతి నోటి నవ్వు నాకమోనరకమో
వినుము సోదరుండ వీరభద్ర
ఆటవెలది పద్యసుమాలు :- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి