స్ఫూర్తిదాతలు98, :- అచ్యుతుని రాజ్యశ్రీ

 తమిళనాడులోని కుగ్రామంలో ఇంటింటికీ తిరిగి బట్టలమ్మే దంపతులకు 6గురు సంతానం.వారిలో ఒకడు సత్యసుందరం వీధిలైట్లు వీధిలైట్లవెలుగులో12వక్లాస్ లో జిల్లాఫస్ట్ వచ్చాడు.రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తూ డిగ్రీపూర్తిచేసి కంప్యూటర్ పై పట్టుసాధించి టెక్ మహేంద్ర లో జాబ్ లో చేరాడు.ఓబీదపిల్లాడిని చదివించాడు.బ్రాడ్రిడ్జ్ కంపెనీలో చేరి 5గ్రామాల్లో బడిపిల్లలకి ట్యాబ్  లాప్టాల్ లు అందించాడు.జనరేషన్ నెక్స్ట్ లైబ్రరీ పథకంకింద పిల్లల కి ల్యాప్టాప్స్ అద్దెకు ఇచ్చే ఏర్పాటు చేశాడు.బిశ్వనాథ్ నారూ 10వక్లాస్ ఫస్ట్  న పాసైనా బీదరికం కూలీచేసే  తల్లికోసం చేపలమార్కెట్ లో పనిచేశాడు.కూలీపిల్లలకోసం వివేకానంద విద్యామందిర్ అనే బడిని పెట్టాడు.10గంటలదాకా చేపలు అమ్మి ఆతర్వాత మాష్టారు అవతారం ఎత్తేవాడు.45ఏళ్లు బడినడిపి ప్రయత్న అనే ఎన్జీవోకి అప్పగించిన ఆయన గొప్పతనం అపూర్వం, కాగజ్ నగర్ కి చెందిన పంజలనివాస్ గౌడ్ బీదరికం అనుభవించి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ లో చేరాకపిల్లలకి బడిఫీజు కడ్తూ 30మందికి పైగా యువత కిబాక్సింగ్ నేర్పటం ముదావహం.ఆపిల్లలు వివిధ పోటీల్లో పాల్గొంటున్నారు.ఒకమ్మాయి బి.ఎస్.ఎఫ్.లో చేరితే ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తున్నారు🌹
కామెంట్‌లు