ఇలవేల్పులు పిల్లలు:--- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
పిల్లలతో కళకళ
సెలయేరుల గలగల
తారమ్మల మిలమిల
లేకుంటే వెలవెల

ఇల్లంతా సందడి
బుడిబుడి నడకలతో
తలపించును సింగిడి
నవ్వుల పూవులతో

పసి పిల్లల లోకము
భువిని స్వర్గధామము
అత్యంత పవిత్రము
చూడ దేవాలయము

పిల్లలు ఇలవేల్పులు
ప్రకాశించు భానులు
సదనానికి అందము
మిక్కిలి ఆనందము


కామెంట్‌లు