చిన్నారులు-చిరు దివ్వెలు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
లోకము తెలియని పిల్లలు
నాకము పంచే వేల్పులు
విరిసివిరియని మల్లెలు
ఆకసాన హరివిల్లులు

పవిత్రమైనవి మనసులు
అందమైనవి నగవులు
బుడిబుడి నడకల బాలలు
గృహమున వెలిగే ప్రమిదలు

ఆడేపాడే పిల్లలు
రేపటి భారత పౌరులు
భారతమ్మ ప్రియ పుత్రులు
అందరికీ  నిజ మిత్రులు

పిల్లల మాటలు గలగల
ఇంటిలో ఉన్న కళకళ
వారే తొలకరి చినుకులు
తేనెలూరే పలుకులు


కామెంట్‌లు