ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
పూవులు లేని తోటలు
రాజులు లేని కోటలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
ఉపకరించని మాటలు

తారలు లేని రాత్రులు
తావులు లేని పూవులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
పిల్లలు లేని గృహములు

మమతలు లేని మనసులు
మంచి చేయని మనుషులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
విలువలు లేని బ్రతుకులు

ఫలములు లేని తరువులు
ప్రకాశించని ప్రమిదలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
సంస్కారమివ్వని చదువులు

కలువలు లేని కొలనులు
వలువలు లేని తనువులు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
నెమ్మది లేని బ్రతుకులు

సహకరించని చేతులు
వట్టిగా వాగే జిహ్వలు
ఎందుకు!ఎందుకు!!ఎందుకు!!
నవ్వులు విరియని ముఖములు


కామెంట్‌లు