అత్యంత ప్రాముఖ్యము:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
విత్తడానికి పొలము
వ్రాయడానికి కలము
అత్యంత ప్రాముఖ్యము
త్రాగడానికి జలము

పాడడానికి గళము
ఆడడానికి స్థలము
అత్యంత ప్రాముఖ్యము
వెళ్ళడానికి ద్వారము

నడవడానికి మార్గము
మనశ్శాంతికి ధ్యానము
అత్యంత ప్రాముఖ్యము
ఎదగడానికి జ్ఞానము

వెలగడానికి దీపము
కొలవడానికి దైవము
అత్యంత ప్రాముఖ్యము
సృష్టియందున స్నేహము


కామెంట్‌లు