ఆశల పందిరి:: -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
వికసించిన పువ్వుల్లా
నవ్వులు వెదజల్లుతాం!
వెలుగుతున్న దివ్వెల్లా
చీకటిని తరిమేస్తాం

నింగిలోని తారల్లా
జగతిలోన వెలుగుతాం
ప్రవహించే యేరుల్లా
నలుగురికి సాయపడతాం

సరిహద్దు సైనికుల్లా
త్యాగగుణము చూపిస్తాం
తెలుగు వెలుగు ప్రేమికులై
మాతృభాష రక్షిస్తాం

కలం చేత పట్టుకుని
కావ్యాలు వ్రాసేస్తాం
కవన వనంలోన మేం
కలకాలం జీవిస్తాం

పూలలోని తావిలా
పాలలోని తెలుపులా
పదిమందికి కనిపిస్తాం
ఎద ఎదనూ మీటుతాం


కామెంట్‌లు