నిజమే కదా!!:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
పసి పిల్లలు నవ్వితే
సిరిమల్లెలు విరిస్తే
కనువిందే చేయదా!
జాబిలిని తిలకిస్తే

వృక్షాలను పెంచితే
మమకారం పంచితే
నందనవనం కాదా!
సమ సమాజం రాదా!

ఘన కార్యాలు చేస్తే
జన హితమే కోరితే
సంబరాలు జరుగవా!
సమైక్య గీతి పాడితే

కలహాలే వీడితే
కలసిమెలసి బ్రతికితే
జగతి ప్రగతి పెరుగదా!
చేయి చేయి కలిపితే


కామెంట్‌లు