బామ్మ సూక్తులు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
అన్ని చోట్ల మౌనము
పనికిరాదు సతతము
విప్పాలి నోరు ఇక
జరిగితే అన్యాయము

ఉదయము లేని రోజు
హృదయము లేని మనిషి
కానలేము మహిలో
యోచింపుము మదిలో

పొదుపు చేయని ఊరు
అదుపు ఉండని నోరు
అభివృద్ధికి దూరము
అక్షరాల సత్యము

తవ్వరాదు గోతులు
వద్దు వట్టి నీతులు
చేతలే అవసరము
ఆదర్శము ముఖ్యము


కామెంట్‌లు