మాతృమూర్తి మేలి మాటలు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
అక్షరాల వెలుగులో
అజ్ఞానం తుడుచుకో!
అంతులేని ఆనందము
జీవితాన నింపుకో!

పుస్తకాల పఠనంతో
మస్తకం వెలిగించుకో!
మహనీయుల స్ఫూర్తితో
ఆశయాన్ని చేరుకో!

సత్సంబంధాలతో
సమాజాన వెలిగిపో!
సత్కార్యాలతో
జనం మదిలో మిగిలిపో!

కీర్తినిచ్చు పనులతో
చరిత్రలో ఉండిపో!
స్ఫూర్తినిచ్చు పలుకులతో
మహాత్ముల్లో చేరిపో!


కామెంట్‌లు