మన ఘన సంపద అడవులు:- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు,9966414580
జీవకోటికి అమ్మ ఒడి
పాఠాలు నేర్పే బడి
మన జాతీయ వనరులు
చూడ చక్కని అడవులు

సకల ప్రాణులకు నెలవులు
ఇచ్చును ఔషధ మూలికలు
అడవులుంటే  బ్రతుకులు
అభివృద్ధికవే  త్రోవలు

పచ్చదనపు పాన్పు వేసి
వర్షాలను కురిపించి
సిరులునిచ్చి సేద దీర్చు
ప్రాణవాయువు మనకు పంచి

పెంచునోయి! భూసారము
అవే జీవనాధారము
అమూల్యమైనవి అడవులు
నరికివేస్తే ఇడుములు

అడవులే లేకుంటే
భువిని కరువు కాటకాలు
భూసారం కోల్పోయి
పంట దిగుబడి తగ్గును

మన ఘన సంపద అడవులు
కాపాడుట మన బాధ్యత
లేక మానవ మనుగడకు
పెను ప్రమాదం జీవులకు


కామెంట్‌లు