సంక్రాంతి సందేశం:- --గద్వాల సోమన్న ,9966414680
వచ్చింది సంక్రాంతి
తెచ్చింది నవకాంతి
జగతిలో మెండుగా
గుండెలో నిండుగా

ముంగిట్లో ముగ్గులు
నింగిలోని చుక్కలు
తెచ్చెను సదనాలకు
అంతులేని సొబగులు

ఇంటిలో సంబరము
తాకింది అంబరము
రైతన్న ఎద్దులతో
భువిని కోలాహలము

హరిదాసు కీర్తనలు
గంగిరెద్దుల ఆటలు
దోచునోయ్! హృదయాలు
ఇంటికొచ్చిన పంటలు

సఖ్యత పండాలని
సభ్యత పెరగాలని
సంక్రాంతి సందేశము
అక్షరాలాదేశము


కామెంట్‌లు