కలియుగ దైవమా ! శ్రీ వెంకటేశ్వరుడా !!:- " కావ్యసుధ "
నీ పాదాల చెంత
శిరస్సు వంచితే చాలు 
సిరులనిస్తావు...
కేల్మోడ్చి మ్రొక్కితే                             
కలిమినిస్తావు...
కేశఖండనతో
క్లేషాలు తీర్చేవు .

ఎదలోని బాధలను 
చెప్పుకుంటే చాలు
అక్కున చేర్చుకొని 
అభయ మిస్తావు 
ఆదుకుంటావు....

ఏడుకొండల స్వామి !
ఎక్కడున్నావయ్యా !!
ఏడుకొండల పైన 
ఎక్కి కూర్చున్నావు 
నా గుండెల్లో దైవమా !
కొండల్లో నిలిచావు !!
ఏడు కొండల నెక్కి
రమ్మంటూ పిలిచావు.

పద్మనయనముల 
పద్మావతి ప్రియుడు 
గోవిందా ! గోవిందా !!
అను నామస్మరణతో 
జన్మ జన్మలలోని 
పాపాలు తీర్చేవు 

శ్రీనివాసా..........అంటే 
సిరి సంపదలనిచ్చు....
వెంకటేశా......... అంటే 
శాపాలు తొలగించు...
ఏడుకొండలస్వామియని
ఆర్తితో పిలిచితే........
కొండలే దిగివచ్చు......

కలియుగ దైవమా అంటే 
కష్టాలు కడతేర్చు వెంటే 
నరుల పాపాలబాపేటి - హరుడా !
కలియుగ వెంకటేశ్వరుడా !!
========================
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు