పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టం:- పాక శరణ్య-ఎనిమిదవ తరగతి-వల్లాల ఆదర్శ పాఠశాల
 అనగనగా ఒక ఊరు ఉండేది, ఆ ఊరిలో చాలా సంతోషంగా ఒక కుటుంబం ఉండేది, అమ్మానాన్న అక్క తమ్ముడు ఉండేవారు, వాళ్ళ అమ్మానాన్న ఏ గొడవలు లేకుండా ఉండేవారు, వాళ్ళ కూతురిని కొడుకుని ఏ లోటు లేకుండా చూసుకునేవారు, వాళ్ళ అమ్మానాన్న అసలు ఏ గొడవ లేకుండా కలిసిమెలిసి ఉండేవారు, వాళ్ళ అమ్మానాన్న ఒకసారి కూడా ఖాళీగా ఉండేవారు కాదు, ఎప్పుడు పనికి వెళ్లేవారు, వాళ్ళ అమ్మానాన్న మీద ఇతరులు ఒక కన్నేసి ఉంచేవారు,వాళ్లు సంతోషంగా ఉంటే ఎవరికి నచ్చకపోయేది. ఎందుకంటే వాళ్ళ అమ్మానాన్న తెలివిని చూసి ఇతరులు చాలా కుళ్లుకునేవారు, కానీ వాళ్ళ అమ్మానాన్న అదేమి పట్టించుకోకుండా వాళ్లు అందరితో మంచిగా ఉంటూ వాళ్ళ పిల్లలను సంతోషంగా చూసుకునేవారు, ఎందుకంటే వాళ్లలాగా వాళ్ల పిల్లలు కూడా కష్టపడకూడదని మంచిగా చదివిస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటే ఒక గొప్ప స్థాయికి ఎదగాలని వాళ్ళ అమ్మానాన్న చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ అమ్మానాన్నని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేవారు, ఇతరులను చూసి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకోకుండా వాళ్ల స్థాయి తగ్గట్టు ఉండేవారు కానీ ఇతరులకి వాళ్ళు ఎలా ఉన్నా కూడా నచ్చకపోయేది, కానీ వాళ్ల పిల్లలు ఇతరులు చెప్పే మాటలు వినకుండా ఆ అక్క తమ్ముడు ఇలా అనుకున్నారు "మన అమ్మానాన్న మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా! మనం కూడా మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగి మన అమ్మానాన్నలకి మంచి పేరు తెచ్చే విధంగా చదువుకుందాం చాలా కష్టపడదాం మన అమ్మానాన్నని  చాలా సంతోషంగా ఉంచాలని" ఆ అక్క తమ్ముడు అనుకున్నారు.

ఈ కథలోని నీతి: తల్లిదండ్రులు పడే కష్టానికి విలువ ఇవ్వాలి 

కామెంట్‌లు