నేల, నింగి, నిప్పు, నీరు:- కోరాడ నరసింహా రావు

 మనల గన్న తల్లి నేల, తండ్రి నింగి... 
   మనకు తోడబుట్టిరి , నిప్పు, నీరు.. 
  ఈ జగతిన ఒకే కుటుం బము మనము
   పోరు నష్టము, పొందు లాభము 
  తెలిసి మసలుము తెలివైన మనిషి నీవు ! 
       *****
నేల వేడెక్కి,మల - మల మాడుచు0డె
  నింగి,అతివృష్ఠి- అనావృష్ఠి- నిప్పుల
 వర్షము గురిపించుచు0డె 
   అమృతతుల్యమౌ నీరు, 
విషముగామారి పోయె
  ఆహా...మితిమీరిన మనిషి సుఖము  ఎంత ముప్పును తెచ్చి పెట్టె! 
       *****
కామెంట్‌లు