కవితోపాఖ్యానం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మంచికవిత
చదివితే
మనసు
మురిసినట్లే

కమ్మనికవిత
విందునిస్తే
కడుపు
నిండినట్లే

తీయనికవిత
రుచిచూపిస్తే
తనివి
తీరినట్లే

తేటకవిత
తటస్థపడితే
తృప్తి
దక్కినట్లే

అందాలకవిత
అందితే
ఆనందాన్ని
అందుకున్నట్లే

అద్భుతకవిత
హత్తుకుంటే
కవిగారు
విజయంసాధించినట్లే

నిత్యకవిత
అలరిస్తుంటే
కవిగారి
నిరంతరకృషిఫలించినట్లే

కవులు
అపరబ్రహ్మలే
కవితలు
ఆనందసాధనాలే


కామెంట్‌లు