చమక్కులు విసరనా
మదులను దోచనా
చంకీలు చల్లనా
తళుకులు చూపనా
తెలివిని చాటనా
తమాష చేయనా
ఉరుములు లేకుండా
మెరుపులు చూపించనా
తెలుగు కావాలనికోరనా
తెగులు ఏమాత్రమువద్దననా
విషయము వివరించనా
వ్యాఖ్యానము వినిపించనా
మాటలనేర్పు ప్రదర్శించనా
మదులను ముట్టనాతట్టనా
మోములను వెలిగించనా
మహదానందము కలిగించనా
నచ్చినా నచ్చకపోయినా
వద్దన్నా వారించినా
మెచ్చినా మెచ్చకపోయినా
వివరిస్తా వినిపిస్తా
కలమును చేతపడతా
కవితాచమక్కులు కూర్చుతా
గళమును ఎత్తుతావిప్పుతా
చురకలు అంటించుతా
నానీల రచనల్లో
నాల్గవ పంక్తుల్లో
చూపాలట చమక్కులు
తగిలించాలట చురుక్కులు
పదాల్లో చూపించనా
ఉరుకులు పరుగులు
కులుకులు మెరుపులు
వాడీవేడులు తళుకులు
చమక్కులులేని కవితవినిపించిన
చప్పననవలె వ్యర్ధమనవలె
రసహీనమనవలె తెలివితక్కువనవలె
ప్రేక్షకవీక్షకులార వివేకవంతులారా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి