అజ్ఞాన మనో నల్ల బల్ల పై
జ్ఞానసూర్య సుద్దముక్క
అక్షర కిరణాలతో ...
వెలుగుల జ్ఞాన అక్షర కిరణాలను విరజిమ్ము తున్న ప్రతి సారీ ...!
అవివేక డస్టర్ , ఆ అక్షర కిరణ వెలుగులను ప్రతి మారూ తుడిచేస్తోంది..!!
గమనించిన వివేకం...
ఆ అవివేక డస్టర్ తుడిచే లోపే...
ఆ జ్ఞానకాంతిని చిత్తమున పదిల పరచు కుని...
కర్మ ,జ్ఞానపరి పక్వతతో...
ఖ్యాతి నార్జించి , సన్మాన సత్కా రములను పొందుటయేగాక...
చరిత్రలో ఒక చిరగని పేజీ యై... రెప-రెప లాడు తున్నాడు...!!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి