శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో 100 సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఏడవ తరగతి నుంచి పదో తరగతి వరకు మాత్రం ఖాళీలు ఉంటే భర్తీ చేస్తామని మరియు వచ్చే ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ పేర్కొన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూ ఎస్ కేటగిరీ విద్యార్థులు రూ.125, ఓసీలు రూ. 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
www.telanganams.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి