బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మద్దిశెట్టి సామేలు
 బీజేపీ భారతీయ జనతా మజ్దూర్ సెల్ (బీజేఎంసీ) ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లోని అబిడ్స్, మీడియాప్లస్ లో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు అర్నాబ్ చటర్జీ గారు మరియు జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి గారు పాల్గొన్నారు. 
              ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా డా. మద్దిశెట్టి సామేలు గారిని మరియు జాతీయ ఉపాధ్యక్షులుగా మహావీర్ కొరవి గారిని నియమిస్తూ నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
    నియామక పత్రాన్ని      తెలంగాణ రాష్ట్ర డి జి పి తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనరు కి సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కమిషనర్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మరియు యస్పి గారికి తెలంగాణ రాష్ట్ర బి జె పి  అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మద్దిశెట్టి గారి నియామక పత్రాన్ని పంపించడము జరిగింది. కార్యక్రమంలో విశ్వ హిందూ మహా సంఘ్ ఆంద్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ డా.యు వి రత్నo గారు మద్దిశెట్టి సామేలుగారిని గజమాలతో ఘనoగా సత్కరించడము జరిగింది
ప్రముఖ రచయిత్రి డా.ధనాసి ఉషారాణి  మద్దిశెట్టి సామేలు గారికి అభినందనలు తెలియజేసారు

కామెంట్‌లు