మేలుకొలుపులు(మత్తకోకిల)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
 13.
నారదాదులు పాడుచుండిరి నాద కీర్తన వాకిటన్ 
శారదాంబయు మీటుచుండెను సప్తతంత్రులు కచ్ఛపిన్  
సారసాప్తుడు చేయుచుండెను సామగానము బిగ్గరన్ 
మీరశాయి! ముకుంద! మాధవ! మేలుకో ధరనేలుకో!
నిఘంటువు:
కచ్ఛపి= సరస్వతి వీణ
సారసాప్తుడు= సూర్యుడు 
మీరశాయి=సముద్ర శయన
14.
రామ సీతను కాయగన్ రిపు రావణాసురుఁ జంపి,నీ
నామ కీర్తన జేస్తు నిత్యము నమ్ము కోతులఁ గాస్తివో
మామమామవు! నేమిఁ దాలిచి మమ్ము పేర్మిని కాయరా!
మేము నిల్తిమి యింటి ముంగిట మేలుకో ధరనేలుకో!
--------------------------------------------------
నిఘంటువు:
రామ = అందమైన స్త్రీ 
కాయగన్= కాపాడుటకు
రిపు= శత్రువు 
మామమామ= మామకు మామ అయినవాడు, విష్ణువు 
నేమి= చక్రము
--------------------------------------
డాక్టర్ అడిగొప్పుల సదయ్య 
వ్యవస్థాపక అధ్యక్షుడు 
మహతీ సాహితీ కవిసంగమం 
కరీంనగరం
9963991125

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
పద్యములు బాగున్నాయి సార్. 🌹🙏🌹అభినందనలు.. శుభాకాంక్షలు 🙏