నవ్వుకుందాం..సాయికిరణ్
 1లెక్కలసార్: పిల్లలూ! అటెండెన్స్ తీసుకుంటా. సైలెన్స్!
 సార్! నాపేరు పరిధి.మాఇంటిపేరు వ్యాసం!
సార్! నాపేరు జ్యామతీయి 
సార్! నాపేరు రేఖా సరళరేఖ
సార్! నాపేరు త్రికోణ్ 
సార్! నాపేరు చతురస్ర్ 
సార్! నాపేరు కర్ణము!
=========================
2అత్త కోడలితో" చూడమ్మా! నేను ఈఇంటికి ప్రధాన మంత్రిని.మీమామగారు రాష్ట్రపతి.మీ ఆయన హోంమినిష్టర్! ఆడపడుచు విదేశాంగ మంత్రి.తోడికోడలు ఆర్థికమంత్రి.నీకు ఏపదవి కావాలి?
"ఆంటీ! నేను ప్రతి పక్షనేతగానే ఉంటా. మీ ప్రభుత్వంని కూలదూసే ప్రయత్నం చేస్తుంటాను. 
===============================
3రాము: ఏంట్రా అంత ఉషారు?
సోము: ఒకమ్మాయి నాతో తొలిసారి మాట్లాడిందిరా!
రాము ..ఏమని?
సోము...ఇది మెట్రోలో లేడీస్ సీట్!
ముందు లేచి నించో.నేను కూర్చుంటాను.
=====================================


4 లాయర్ గారూ! మా ఆవిడ కి విడాకులిస్తా నండీ.5ఏళ్లబట్టీ వంటింట్లోంచి సామాన్లు విసిరికొడ్తోంది.
మరి ఇన్నాళ్లు ఎందుకూరుకున్నావు?
ఇప్పడు వాటిని గురిపెట్టి నాపై సరిగ్గా విసరటంతో దెబ్బలు తగుల్తున్నాయి సార్😃
కామెంట్‌లు