ఎడారంటి మనసులో
వేదనలెన్నో!
బీడైన పొరలలో
కోరికలెన్నో!
మోడైన బ్రతుకులో
మలుపులెన్నో!
పాడైన చేనిలో
కలుపులెన్నో!
రెప్పల వెనుక వేచిన
కలలేన్నో!
కుప్పగ పోసిన గతంలో
కలతలెన్నో!
చేతిలో ఇసుకలా జారే
క్షణాల వేగంలో
పట్టుకోలేక వదిలిన
అదృష్టాలెన్నో!
చేరుకోలేని తీరాల
ఊరుకోనివ్వని ఊసులెన్నో!
దూరమైన బంధాలకై
దారివైపు చూసే చూపులెన్నో!
ఎండిన నదిలోనూ
నిండుగ నీరోస్తుందని
వెంటాడిన వెతలన్నీ
వెనుకకు మరలి వెడతాయని
వెలుగులు పంపే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి