నవ్వుకుందాం! సాయికిరణ్



 1క్యాష్ లేదండీ! రేపు రండి " అన్న మానేజర్ పై ఎగిరి పడ్డాడు" నాకు ఇప్పుడే కావాలి " అని రామయ్య."శాంతి తో మాట్లాడవయ్యా" " ఐతే ఆశాంతిని‌పిల్పించండి" అన్న మాటలు విని నవ్వారు అక్కడున్న జనం.
2" అరేయ్! మాఆవిడ తో చస్తున్నారా!పనితో తెగ సతాయిస్తోంది.వెల్లుల్లి పొట్టు తీయమంటుంది.ఉల్లిగడ్డ తరగమంటుంది.అంట్లుతోమమంటుంది" " ఓరి! ఇదేం కష్టం కాదురా రామం! 
 వెల్లుల్లి ని కాస్త వేడి చేస్తే పొట్టు త్వరగా వస్తుంది.ఫ్రిజ్ లోనో చన్నీటి లోనో ఉల్లిపాయ నానేస్తే కట్ చేసేప్పుడు కళ్ళు మండవు.అంట్లు టబ్ నీటిలో మునిగేలా పడేయ్.అంతే!"
3ఏమోయ్! మీటర్ చార్జీ కి వస్తావా?" " ఉహు! 100ఎక్కువ ఇవ్వాలి.ట్రాఫిక్ లో నడపడం కష్టం"."నేనే నడుపుతా ఆటోని.నీవు పక్కన కూర్చో" డంగైపోయాడు ఆటోవాలా 
"ఏమోయ్! నాకు హస్తం చూడటం వచ్చు.మీ ఇంటికింద ధనలక్ష్మి సదా ఉంటుంది.అదృష్టవంతుడివి"
" సరేలే! బ్యాంకు పై అంతస్తులో నేను అద్దెకుంటున్నాను.నాకేం లాభం?"😀
కామెంట్‌లు