పాతపట్నం నియోజకవర్గం స్థాయిలో ప్రారంభమైన మూడు రోజుల 68వ ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గ్రిగ్స్ పోటీల్లో కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రెండు విభాగాల్లో విజేతలుగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ తూతిక సురేష్ లు తెలిపారు. నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తొలిరోజు నిర్వహించిన బాలికల వాలీబాల్ పోటీల్లో ప్రథమ, బాలికల కబడి పోటీల్లో ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు పొందారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొని బాలికలతో పాటు షీల్డ్ లు, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. నివగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని సువ్వారి నిర్మల, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మాళి భాస్కరరావు, కోల రాజారావు తదితరుల చేతులమీదుగా ఈ బహుమతులను పొందారు. ఇందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి జిల్లా స్థాయిలో శ్రీకాకుళంలో జరుగనున్న పోటీలకు పంపించనున్నట్లు వారు తెలిపారు. తొలుత పాతపట్నం నియోజకవర్గ పరిధిలోగల ఐదు మండలాలకు చెందిన 14 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలబాలికలకు మూడు రోజుల పాటు జరిగే ఈ గ్రిగ్స్ పోటీలను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. విజేతలైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ప్రశంసించారు.
గ్రిగ్స్ తొలిరోజున కడుము పాఠశాల ప్రతిభ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి