భగవంతుని యందు మనస్సు నిశ్చలమై నిలకడగా నిలుచుటకు చిత్తమునకు ప్రసన్నత ఆవశ్యకము. ఈ ప్రసన్నత మనస్సు అరిష డ్వర్గములకు దూరమైననాడు, జీవునికి లభిస్తుంది. భగవద్భక్తి ఉషః సంకీర్తనం వలన వృద్ధిచెందుతుందని శ్రీమన్నారాయణుని నామాన్ని అర్చించి, కీర్తించి, చింతించనంతనే మహా పాపములన్నీ అగ్ని, దూదిని దహించునట్టుగా నశింప జేయునని ధనుర్మాస విధుల వలన తెలుస్తోంది.
ఈ ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయాలలో అండాల్ తిరుప్పావై చేస్తారు. 'తిరు' అంటే 'శ్రీ' అని 'పావై' అంటే 'వ్రతం' అని తిరు ప్పావై గొప్పదైన వ్రతం అని భావం. ఇది తమిళ దేశం నుంచి మన దేశానికి వచ్చిన వైష్ణవ సంప్రదాయం. స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీకృష్ణుని నిద్రలేపి తమ అభీష్టం తెలిపి ఆయన పరమానుగ్రహం పొందటం తిరుప్పావై యొక్క సారాశం తిరుప్పావై మేలు కొల్పు సంప్రదాయానికి ప్రతీక.
ఉషః కాలం బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరిస్తే మనసు ప్రశాంతంగా శరీరం లాఘవంగా ఉంటుంది. ఈ ధనుర్మాసమంతా గోదాదేవి ప్రాతః కాలంలో స్నానమాచరించి శ్రీవట పత్రశాయి పైగల అచంచలమైన అనురాగంతో పలురకాల పుష్పమాలలతో, అలంకరించి, ఆరాధించి నైవేద్యనివేదనలు చేసి, ముప్పది రోజులు ముప్పది పాశురాలను ఆలపించి స్వామిని మెప్పించి అర్పించింది.
పరతత్త్వమైన శ్రీకృష్ణపరమాత్ముని ఈ ధనుర్మాసంలో భక్తి పూర్వ కంగా కీర్తించిన గోదాదేవి కారణ జన్మురాలు. శాస్త్ర పారం గతురాలు, పరమ భక్తురాలు. జ్ఞానియైన గోదా పుణ్య చరిత తిరు ప్పావై, శ్రీమహావిష్ణువు భక్తి ప్రాముఖ్యతను విశిష్టతను తెల్పు తున్నది.
'గోదా' అంటే 'గో' తత్త్వ జ్ఞాన 'దా' అంటే ఇచ్చునది. గొప్ప జ్ఞాన ప్రదాత. గోదాదేవి. నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక.
'భక్తా త్వనన్యయానక్క జ్ఞాతుం ద్రష్టుంచ తత్త్వే ప్రవేషంచ' భగవంతుని ఎరుంగుటకు, అతనిలో లీనమగుటకు భక్తియే సాధనం. గోదాదేవి భగవం తునిలో లీననమగుట, శ్రీరంగనా థుడు తనలో ఐక్యం చేసికొని, జన్మరాహిత్యాన్ని ప్రసాదించి తనలో లీనం చేసికొన్నాడు. ఈ పవిత్ర రోజున భోగి 'భోగము' అనగా పరమాత్మ అనుభవం. ఆనాటి నుండి భోగిరాజు వైష్ణవాలయాలలో " గోదా కళ్యాణం " జరపటం సంప్రదాయంగా మారింది.
'కోదండ స్నే సవితరి ప్రత్యూషక' పూజయేద్దరిమ్ సహస్రాద్ధార్చన
ఫలం దినేనైకేన సిద్ధ్యతి'
ముప్పై రోజులు అర్చన చేస్తే ముప్పైవేల సంవత్సరాలు ఆరాధించిన ఫలం, లేదా ముప్పది పాశురాలలో మొదటి పాశురాన్ని, చివరి పాశురాన్ని ఫఠించిన ఫలం లభిస్తుంది.
శ్రీవిష్ణుచిత్త తనూజాయై శ్రీగోదాయై నిత్యమంగళమ్ !
" కావ్యసుధ "
'వాజ్ఞ్మయ భూషణ'
'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
" ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ "
9247313488 : హైదరాబాదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి