నీతి కథల విలువ : సరికొండ శ్రీనివాసరాజు

  ఆ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు తరచుగా నీతి కథల ఆవశ్యకత పిల్లలకు చెప్పేవారు.  తరచూ నీతి కథల పుస్తకాలు చదవడం,  పెద్దలతో చెప్పించుకోవడం చేయాలనే వారు. టీవీ లు, మొబైల్ ఫోన్లకు బానిసలు అయితే కష్టాలు తప్పవని అనేవారు.  
      ఏప్రిల్ 23. ఆ విద్యా సంవత్సరానికి పాఠశాలలో చివరి రోజు.  తెలుగు ఉపాధ్యాయుడు అన్ని తరగతుల పిల్లలకు ప్రత్యేకంగా చెప్పారు.  "ఈ వేసవి సెలవుల్లో ఆట పాటలతో కాలక్షేపం చేయండి.  పెద్దల దగ్గర చేరి, కథలు చెప్పేది చెప్పించుకోండి.  బాగా కథల పుస్తకాలను కొని చదవండి. కథలు చదవడం వ్యసనంగా మారితే జీవితంలో పైకి వస్తారు." అని. 
      వేసవి సెలవులు గడిచాయి.  పాఠశాలలు మళ్ళీ ప్రారంభంఅయినాయి.  వారం రోజులు గడిచాయి.  ఆ రోజు పాఠశాలకు ఎక్కువ మంది విద్యార్థులు వచ్చారు.  తెలుగు ఉపాధ్యాయుడు ఆయా పీరియడ్స్ లో పిల్లలు తాము వేసవిలో చదివిన, విన్న కథలు రాయమన్నారు. కొద్ది మంది మాత్రమే కథలు రాసినారు. ఆయా తరగతులలో  అందరి కంటే ఎక్కువ నీతి కథలు రాసిన విద్యార్థులను పిలిచి మెచ్చుకున్నారు.  తరగతి వారీగా ఫస్ట్ మరియు సెకండ్ వచ్చిన విద్యార్థులకు మంచి విలువైన కథల పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు.  కథలు చెప్పని విద్యార్థులు రోజూ విధిగా 2  కథలు రాసుకుని రావాలని,  ప్రతిరోజూ చూస్తానని చెప్పారు తెలుగు ఉపాధ్యాయుడు. ప్రతి శనివారం ఆఖరి పీరియడులో వారికి కథల పోటీ ఉంటుందని ప్రకటించారు. క్రమంగా విద్యార్థులంతా కథల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఫలితంగా వారి ప్రవర్తన మంచి దారిలో పడుతుంది.   

కామెంట్‌లు