రాష్ట్రంలో పాఠశాల స్థాయి విద్య అత్యద్భుతంగా వెలిగిపోతోందని, దేశవ్యాప్తంగా పాఠశాల విద్యా ప్రమాణాలను పెంచడంలో భారత దేసం ప్రథమ స్థానంలో వుందని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆర్భాటపు ప్రకటన ఇచ్చారు. అయితే ఇవన్నీ సత్యదూరాలేనని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేవని వివిధ సంస్థల సర్వేలలో తేలింది. జూన్ 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం అవగా వివిధ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకం, విద్యార్థుల ఎన్రోల్మెంట్ వంటి సమస్యలను విద్యాశాఖ ఏ మాత్రం పరిష్కరించకుండా గాలికొదిలేసింది.ప్రభుత్వ బడుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వున్నాయి. 26 వేల బడులలో 26 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ రంగం లో చదువుకుంటుండగా వారి కోసం 2.5 కోట్ల పుస్తకాల అవసరం వుంది. అయితే ఇప్పటివరకు 40 లక్షల వరకు మాత్రమే పుస్తకాల ముద్రణ,పంపిణి పూర్తయ్యింది.గత రెండేళ్ల నుండి విద్యార్ధులకు యూనిఫారం లు ఇవ్వలేదు.ఈ ఏడాది మొత్తం నాలుగు జతల యూనిఫారం ను పంపిణీ చేస్తామని విద్యా శాఖ ప్రకటించగా అయితే రెండేళ్ళ తర్వాత స్కూళ్ళు ప్రారంభం అయినా ఇప్పటి వరకు ఒక్క జత కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం చేసుకున్న టెస్కో సంస్థ ఇప్పటివరకు బట్ట పంపిణీ కూడా చెయ్యలేదని తెలుస్తొంది. మొదటి రోజే చిరుగుల బట్టలతో స్కూళ్ళకు వచ్చిన విద్యార్ధుల ఫొటోలు మీడియాలో చూస్తుంటే ఎంతో జాలి కలుగుతొంది.వారికి ఉచితంగా ఇవ్వాల్సిన బ్యాగులు, స్టేషనరీ కిట్ల పంపిణి కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇక పాఠశాలలు ప్రారంభం కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా వున్న 22 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని, పదేళ్ళ పైబడి కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని మూడు నెలల కింద విద్యాశాఖ ఘనంగా ప్రకటించింది.రెండేళ్ళ నుంచి పని లేకుండా వున్న 17 వేల మంది విద్యావాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకుంటామని, వారికి గత రెండేళ్ళుగా జీతాలు ఇవ్వని కారణంగా తగిన పరిహారం కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోపల వేలాది ఉపాధ్యాయుల రిటైర్మెంట్లు కూడా జరిగాయి. ఉపాధ్యాయుల భర్తీకి చాలా ఆలస్యంగా ప్రభుత్వం టెట్ పరీక్షను జూన్ 19 న నిర్వహిస్తొంది. ఆ తర్వాత టీచర్ల పోస్టుల భర్తీకి నొటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి కనీసం ఏడు- ఎనిమిది నెలల సమయం పట్టవచ్చునని, ఈ లోపల టీచర్ల కొరత కారణంగా విద్యార్ధుల తీవ్రంగా నష్టపోవచ్చునని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెసవి సెలవలలో ఉపాఢ్యాయుల పదోన్నతులు, బదిలీలను ప్రభుత్వం చేపట్టకపోవడం వలన ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొని వుంది. ఇది కూడా విద్యా బోధనపై దుష్ప్రభావం చూపించే అవకాశం వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు, మన బడి కార్యక్రమం కేవలం ఒక మొక్కుబడి తంతుగా సాగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది జూన్ నెల కల్లా పాఠశాల స్వరూపం మార్చేస్తానని విద్యా శాఖ గత జనవరిలో ఘనంగా ప్రకటించింది. అయితే బడి అభివృద్ధి పనులు నామమాత్రంగా ప్రారంభం అయ్యాయి.ఇప్పటి వరకు పైలెట్ కింద చేపట్టిన కొద్ది స్కూళ్ళలో మాత్రం పనులు పూర్తయ్యాయని, మిగితావి టెండర్ల ప్రక్రియలో చిక్కుకుపోవడమో లేక గుత్తేదార్ల నిర్లక్ష్యం వలన ప్రారంభం కాకపోవడం జరిగింది.ఎక్కదా పారిశుధ్య కార్మికుల జాడ లేకపోవడం వలన టీచర్లు, విధ్యార్ధులే స్వయంగా రంగం లోకి దిగి పాఠసాలల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చెసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పారిశుద్ధ్యం, మరుగు దొడ్లు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వలన, సర్కారు బడులలో నానాటికీ దిగజారుతున్న విద్యా ప్రమాణాల వలన అప్పో సప్పో చేసి ప్రైవెట్ స్కూళ్ళకు తమ పిల్లలను పంపించుకోవాలన్న ఆలోచన పేద, మధ్య తరగతి వర్గాలలో సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇకనైనా రాష్ట్రంలో పాఠశాలల స్థితి గతులను మెరుగుపర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
సమస్యల సుడిగుండం లో ప్రభుత్వ పాఠశాలలు: - సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి