ఆడపిల్ల :- కొప్పరపు తాయారు.
ఆడపిల్ల ఆరుబైట గజ్జెల చప్పుడుతో ఆడుతూ వుంటే లక్ష్మీదేవి ముచ్చటపడి ఇంట ప్రవేశిస్తుంది.*

పసిపిల్లకి స్నానం సమయంలో గంగమ్మ తల్లి కోరి ఆనీరులో చేరుతుంది. ఆ పసిపాపకు సాంబ్రాణి పొగ పెట్టేసమయంలో సరస్వతీదేవి, తల్లి గొంతులో గొంతు కలిపి పాట పాడుతుంది.

ఆడపిల్ల వధువై సాగే సమయంలో ఆశీర్వదిస్తూ తాము తన గుర్తుగా ఆ ఇంటే వసిస్తామని గంగ, సరస్వతి, లక్ష్మిదేవులు తమ తమ స్థానాలలో నిలిచిపోయి, ఆ కుటుంబానికి అండగా ఉంటారు.

ఆడపిల్ల విలువ తెలియని వారు వద్దనుకుంటారు. బాధ్యతకు వెనుకాడే వారు బరువును కుంటారు. దైవ స్వరూపమని తెలియని వారు అజ్ఞానులై మిగిలిపోతారు.

పుణ్య దంపతులకు ఆడపిల్ల పుడుతుంది. అప్పగింతల మహాద్భాగ్యం కల్పిస్తుంది.💕

కామెంట్‌లు