దత్త పది:-ఉండ్రాళ్ళ రాజేశం

కింది పదాలతో  రైతు కష్టాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛ ఛందస్సులో పద్యం రాయగలరు.
గట్టు 
తట్ట 
పుట్ట 
చెట్టు......


మత్తకోకిల

గట్టులందున సాగి రైతులు గడ్డపారల పోటులై
తట్టలందున మట్టినెత్తుతు తల్లడిల్లుతు సాగుతూ
పుట్టలున్నను మట్టి తీయుచు భూమి బాగుగ చేయుచూ
చెట్టు చుట్టును పెల్లలేసియు చిట్టి గుండెను నిల్పుమూ


కామెంట్‌లు