సుప్రభాత కవిత : - బృంద

మనసు సుక్షేత్రం 
మనం ఏం నాటితే అవే 
మొలకలు.. అవే పిలకలు
మంచినే పెంచుకుందాం!

ఓర్పు అన్నది ఒక్కటుంటే 
మార్పులు మంచివే వస్తాయి 
ఆలస్యం అవవచ్చు బహుశా 
అసలు రాకపోవడం ఉండదు!

మన్నించడం వల్ల 
మనం బావుంటాం 
వదిలేయడం వల్ల 
ఎదుగుతాం  మనిషిగా!

ఇవాళ మంచిగా జరిగింది 
రేపు ఇంకా బాగుంటుంది 
ఆశ మనుగడకు మూలం 
అదే జీవన సూత్రం!

దయను ఎరువులు వేసి 
పెంచుకుందాం 
అర్థం చేసుకోవడం 
అలవాటుగా మార్చుకుందాం!

ఏదొచ్చినా  అది మనదే!
సొంతమని సర్దుకునేద్దాం!
మనం బావుందాం 
మనవల్ల బాగుండేలా చూసుకుందాం!

ప్రేమను పంచుదాం 
తిరిగి దాన్నే పొందుదాం!
మనతో మనమే ప్రేమలో పడేలా 
మనుగడ మార్చుకుందాం!

ఆలోచనలకు రూపునిచ్చే 
అందమైన అరుణోదయానికి 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు