చిట్టాడివి చిన్నది
దట్టముగా నున్నది
దానిలోన ఉన్నాయి
దుప్పి పిల్లలు ఎన్నెన్నో
గుబురు చెట్ల మధ్యన
గుడ్డేలుగుల్లెన్నెన్నో
చిట్టి పొట్టి మొక్కల్లో
చిన్న చిన్న కుందేల్లెన్నో
పైకి పారిన లతలకు
విరబూసిన పూలెన్నో
పెద్ద చెట్ల కొమ్మలకు
పిట్టలు కట్టిన గూళ్ళెన్నో
అడవికి అందరు వెళ్ళండి
అడవి అందం చూడండి
ఎవ్వరు చెట్లు నరుకొద్దు
ప్రకృతికి చేటు చేయొద్దు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి