ఉపాధ్యాయులకు ఘన సన్మానం

 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి, ఇటీవల బదిలీపై వెళ్లిన ముగ్గురు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులను ఎస్సీ కాలనీ పాఠశాల సిబ్బంది, ఎంఈఓ సిరిమల్ల మహేష్, కాంప్లెక్స్ హెచ్.ఎం. సునీత, పిల్లలు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఈర్ల సమ్మయ్య, ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమతలను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోయల్కర్ స్వప్న, మాధవి, చెన్నూరి భారతి, శైలజలు, తూండ్ల అరుణ కిరణ్ లు  పూలమాలలు, శాలువాలు, మేమంటోతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్, జెడ్పిహెచ్ఎస్ కాల్వశ్రీరాంపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం నరెడ్ల సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూతపడే స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలను ఈర్ల సమ్మయ్య దాతల సహకారంతో పాటు తన సొంత డబ్బులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, అన్ని విధాల పాఠశాలను అభివృద్ధి చేశారన్నారు. ఎస్సీ కాలనీ పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయడమే కాకుండా 11 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఈర్ల సమ్మయ్యను వారు అభినందించారు. ఎస్సీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా మిగతా ఉపాధ్యాయుల సమన్వయంతో పిల్లల్ని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు పంపించి ప్రధాన స్థానంలో నిలిచేలా చేశారని ఈ సందర్భంగా వారు ఈర్ల సమ్మయ్య చేసిన సేవలను కొనియాడారు. అలాగే విజయలక్ష్మి, సమతలు పాఠశాల పిల్లల్ని తమ కన్నబిడ్డల్లాగా చూసుకునేవారని, వారికి చక్కటి విద్యను అందించారని అన్నారు. పాఠశాల పిల్లలు చేసిన నృత్యాలు పలువురుని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, ఎస్సీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోయల్కర్ స్వప్న, సన్మాన గ్రహీతలు ఈర్ల సమ్మయ్య, ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, ఉపాధ్యాయినులు మాధవి, భారతి, శైలజ, తూండ్ల అరుణ కిరణ్, తల్లిదండ్రులు, పిల్లలు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు