చదివి తెలుసుకో ..... : - డా.సి వసుంధర,చెన్నై.
 "తపస్సు చేస్తే గాని
దైవ దర్శనం కాదమ్మా"
 ఈ మాట వింటే 
వస్తుంది ఆపుకోలేని నవ్వు.

  ప్రత్యూష లో 
నిత్యం నీవు దర్శించే
 ఉషాపతి 
ఎవరంటావు?

లోపల అర్చన చేయించి 
వెలుపలకు వచ్చిన  ఓ భక్తురాలా!
ఆర్తితో నీ ముందు చేయి చాచే
ఈ  దీనురాలిలో 
దైవం కనిపించలేదా నీకు? 
 
"దేహం కాదు దేవాలయం.

ఆత్మ దేవాలయం అందులో జ్ఞానమనేది దైవం"
అన్న అరవిందని మాట ఎవరి నోటా నువ్వు వినలేదా?
 
చూడు, అందరినీ దైవస్వరూపులుగా.

కరుణ,దైవస్మరణ  ఈ రెండే నిన్ను కడతేర్చవీ,
ఆవలి గట్టుకు చేర్చే నావలు. 

మన పురాణ గాధలు త్యాగంతో తడిసి ముద్దయి ఉంటాయి. 
చదివి తెలుసుకో       నీ సమస్యలకు అనుమానాలకు
చక్కటి పరిష్కార మార్గాలు.🫘

కామెంట్‌లు