రసగుళికలు :(మినీ కవితలు): --డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 అందానికి నిర్వచనమై,
నాముందునిలుస్తావ్ !
పిట్టకథల పుస్తకం తెరిస్తే 
నువ్వే గుర్తుకువస్తవ్ !!
-------------------------------(1)
నీమిసమిసలు చూసి
నువ్వు పాతికేళ్ల పడుచువని 
ఒకటేగుసగుసలు ....!
నీషష్టి పూర్తిధరహసంఅర్ధంకాక!!
--------------------------------------------(2)
ప్రేమించడం నావంతు ...
ప్రేమించినట్టు నటించటం 
నీ ..నిత్యతంతు ....!
నాలాఅయోమయంలో ఎందరో !!
----------------------------------------------(3)
అందినట్టే అందడం....
అందకుండా జారిపోడం ,
నాగుండెల్లో గుర్తించలేని గాయం !
నీకేమో అపాయంతప్పిన ఉపాయం !!
---------------------------------------------------(4)
అందాల అదుపుకోసం,
నీ..అంతుపట్టని ఆహార్యం..!
నువ్వు దాచుకున్నవన్నీ...
దోచుకోవాలన్నది నా..ఆరాటం!!
-----------------------------------------------------(5)
కరిగిపోని నీ..యౌవ్వనం...
అడవి కాచిన వెన్నెల....!
తరిగిపోయిన నాయౌవ్వనం
దిష్టిబొమ్మలా..దీనంగా నీముందు !!
--------------------------------------------------------(6)
నలుగురునోట్లో-
నానాలన్నదినీలక్ష్యం!
అదిగౌరవంగా అయితే,
కావలసింది ఏమంటుంది !?
------------------------------------(7)
నిన్నుపొగడ్తలతో 
ముంచేస్తారు జనం !
నిజమని నమ్మేస్తావు నువ్వు 
పొగడ్తలపన్నాగాలు తెలిసేవరకు!!
----------------------------------------------(8)
కామెంట్‌లు