ఆశ పోతు చిట్టెలుక:- : పి.హేమ-ఎనిమిదవ తరగతి-ఆదర్శ పాఠశాల వల్లాల
 అనగనగా ఒక చిట్టెలుక. దానికి బాగా ఆకలి అయింది ఒక ధాన్యం బుట్ట కనిపించింది. బుట్టకు చిన్నా రంధ్రం ఉంది. చిట్టెలుక మెల్లగా రంద్రం ద్వారా బుట్టలోకి చేరింది ధాన్యం తినడం మొదలు పెట్టింది. ధాన్యం భలే రుచిగా ఉంది. ఆశపోతు చిట్టెలుక తింటూనే ఉంది దాని పొట్ట బంతిలాగా ఊరేదాకా తినడం ఆపలేదు. తిన్న తరువాత మళ్లీ ఆ చిన్న రంధ్రం గుండా బయటకి రావాలని ప్రయత్నించింది. ఏం లాభం? తావుగా కడుపు ఉబ్బడంతో అది రంధ్రంలో పట్టలేదు. చిట్టెలుకకు భయం వేసింది. బయటకి ఎలా రావాలో తెలియలేదు దానికి. గట్టిగా కిచకిచలాడడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒక ఉడత అటుగా వెళుతుంది. దానికి ఎలుక అరుపులు వినిపించాయి. బుట్ట దగ్గరగా వెళ్లి అడిగింది. "ఎందుకలా కేకలు పెడుతున్నావు?" చిట్టెలుక చెప్పింది "చాలా ధాన్యం తిన్నాను . నా కడుపు పెద్ద బంతిలా అయింది. ఈ రంధ్రంలో పట్టడం లేదు కొంచెం సహాయం చేయవు?"ఉడుత చిట్టెలుకతో ఇలా అంది."భయపడాల్సిందేమీ లేదు. కొద్ది రోజులు బుట్టలోనే ఉండి ఏమి తినకుండా ఉండు చిక్కిపోతావు. అప్పుడు తేలికగా బయటకి రావచ్చు బుట్టలో కూర్చుని ఉపవాసం చేసేటప్పుడు ఈ విషయం ఆలోచించు"జీర్ణం చేసుకోగలిగిన దానికంటే ఎక్కువ తినకూడదు. అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించకూడదు".
 

ఈ కథలోని నీతి: ఆహారం మనకు అవసరం ఉన్నంతనే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు.

కామెంట్‌లు